బోల్తా కొట్టిన ఆటో.. రోడ్డున పడిన మద్యం సీసాలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-28 05:18:06  IST  )

ప్యాసింజర్ ఆటోలో సీసాలు తరలించే క్రమంలో రోడ్డు ప్రమాదం.

బోల్తా కొట్టిన ఆటో.. రోడ్డున పడిన మద్యం సీసాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ఆటో బోల్తా కొట్టడంతో (Auto Accident) మద్యం సీసాలు రోడ్డున పడిన ఘటన చిత్తూరు (Chittoor) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ఆటోలో మద్యం సీసాలను (Liquor Bottles) తరలిస్తున్నారు. గంగవరం (Gangavaram) సమీపంలోని సాయి గార్డెన్ సిటీ వద్దకు ఆటో చేరుకోగానే ప్రమాదానికి గురైంది. టర్నింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజయ్య తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆటో డ్రైవరును చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషయమించడంతో అక్కడి నుంచి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యుల సూచన మేరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం రాజయ్య చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలో తీసుకెళ్తున్న మద్యం సీసాలు రోడ్డుపైన చిందరవందరగా పడ్డాయి. వాటిల్లో కొన్ని బాటిళ్లు పగిలి మద్యం రోడ్డుపై పారింది. గమనించిన స్థానికులు బాటిళ్లను సేకరించి ఒక పక్కన పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ప్యాసింజర్ ఆటోలో భారీ ఎత్తున మద్యం తరలించడాన్ని గుర్తించారు. అయితే మద్యాన్ని కొత్తపల్లి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story