హైదరాబాద్‌కు 12 వేల కేజీల ఆవుమాంసం.. ఖననం చేసిన ఏపీ పోలీసులు

by Naga Rani Yarlagadda |

పోలీసుల తనిఖీల్లో 12 వేల కేజీల ఆవు మాంసం పట్టుబడటం కలకలం రేపింది. శనివారం జీలుగుమిల్లి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగుచూసింది.

హైదరాబాద్‌కు 12 వేల కేజీల ఆవుమాంసం.. ఖననం చేసిన ఏపీ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల తనిఖీల్లో 12 వేల కేజీల ఆవు మాంసం పట్టుబడటం కలకలం రేపింది. శనివారం జీలుగుమిల్లి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గ్రామ శివారులోని హెచ్ పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో కలకత్తా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ ను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. అందులో 12,100 కేజీల ఆవు మాంసం లభ్యమైంది. దీంతో కంటైనర్ ను సీజ్ చేసి.. అందులో ఉన్న ఆవుమాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు. కంటైనర్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 12 వేల కేజీల ఆవుమాంసం కోసం సుమారు 45 ఆవులను వధించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఏ ప్రాంతానికి దానిని తరలిస్తున్నారో, కలకత్తాలో ఎవరు ఈ పనికి ఒప్పుకున్నారన్న విషయాలపై విచారణ చేస్తున్నారు.

Next Story