- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravathi: రాజధానిపై మా విధానం అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. : బొత్స వ్యాఖ్యలు
మూడు రాజధానిలనేది ఆ రోజుకు తయ విధానం అని, రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మూడు రాజధానిలనేది ఆ రోజుకు తయ విధానం అని, రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) అన్నారు. అసెంబ్లీ మీడియా (AP assembly) పాయింట్లో మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ది కోసం మాట్లాడారని అన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ తాత్కాలికంఅని గత ప్రభుత్వం తెలిపిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని సూచించారు. అధికార పార్టీకే పనిచేయాలని సాక్షాత్తూ సీఎం మాట్లాడడం తగదన్నారు. స్వాతంత్రం వచ్చాక ఏ సీఎం ఈ తరహా లో మాట్లాడలేదని తెలిపారు. రుషికొండలో అవినీతి జరిగిందంటున్నారు, అయితే రుషికొండ (rushikonda) కట్టిన కాంట్రాక్టర్ కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలని కోరారు. రుషికొండ లో అవినీతి అక్రమాలు జరిగాయనుకుంటే విచారణ జరపాలన్నారు. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమరావతి (amaravathi rajahani) శ్మశానంలా ఉందని తాను ఆరోజు వ్యాఖ్యానించిన మాట వాస్తవమే అన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడా అని తెలిపారు.






