Nara Lokesh: మన అచ్యుత్ ఇక లేడు..! మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్

by Ramesh Naini |

టీడీపీ యువ నాయకుడు అన్నపురెడ్డి అచ్యుత్ రెడ్డి ఆకస్మిక మరణం తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Nara Lokesh: మన అచ్యుత్ ఇక లేడు..! మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ యువ నాయకుడు అన్నపురెడ్డి అచ్యుత్ రెడ్డి ఆకస్మిక మరణం తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో అచ్యుత్ రెడ్డి మృతి చెందినట్లు తెలిసి షాక్‌కి గురయ్యానని పార్టీ అగ్రనేత, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుక్రవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గం, చిన దోర్నాలకు చెందిన అచ్యుత్ పార్టీ పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన యువ సైనికుడని లోకేశ్ పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన అచ్యుత్‌కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించామని చెప్పారు.

‘పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా కనిపించే మన అచ్యుత్ ఇక లేడన్న వార్త జీర్ణించుకోలేనిది’ అని లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో అచ్యుత్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇచ్చారు. పలు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్‌మీడియా వేదికగా అచ్యుత్‌కు నివాళులు అర్పించారు. ట్వీట్ ఇదే..

Next Story