నిందితురాలిని పట్టించిన ఓటీపీ

by Thanuru Gopichand |

సత్తెనపల్లిలో చిన్నారి చిత్రహింసల కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది.

నిందితురాలిని పట్టించిన ఓటీపీ
X

దిశ, డైనమిక్​బ్యూరో/ పల్నాడు: సత్తెనపల్లిలో చిన్నారి చిత్రహింసల కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తల్లి మాధవి నిత్యం మాస్క్ ధరించి తిరగటంపై అనుమానం కలిగిన పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. తన పేరు మాధవి అని, భర్త చనిపోయినట్లు మాయ మాటలు చెప్పడంపై అసలు నిజాలను పోలీసులు నిగ్గు తేల్చారు. గుంటూరు రామ్ రహీం కాలనీ చాకలి కుంట చెందిన షేక్ సమీర్ భార్య షేక్ దరియాబీ (మాధవిగా) పేరు మార్చుకున్నట్లు గా పోలీసులు గుర్తించారు. దరియాబీ ఏడాది కిత్రం భర్తను వదిలేసింది. తల్లి భర్త ఇండ్లలోని రూ.7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కాజేసి తప్పించుకుని తిరుగుతోంది. దీనిపై భర్య దరియాబీ కనిపించకుండా పోవటం పై భర్త సమీర్ గత ఏడాది జూన్​లో లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏడాదిగా కూతురు ఆచూకీ లభించలేదనే ఆవేదనతో పది రోజుల క్రితం దరియాబీ తండ్రి మృతి చెందాడు. అయితే ఇటీవల దరియాబీ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకునే క్రమంలో భర్త మొబైల్ కు ఓటిపీ వచ్చింది. ఈ సమాచారాన్ని భర్త సమీర్ పోలీసులకు తెలిపాడు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్న కూతురిపై కర్కశత్వం చూపి కేసులో అరెస్టు కావటంతో ఇప్పుడు ఆమె అసలు బండారం బయటపడింది. అయితే ఇంటి నుంచి తస్కరించన బంగారు ఆభరణాలు ఏమయ్యాయి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story