AP Govt:ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది.

AP Govt:ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు(CM chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్(APCOB) లిమిటిడ్ ఛైర్మన్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు.

డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం(AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య(టీడీపీ), కాకినాడ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి(జనసేన), ఏలూరు DCMs(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్‌గా చాగంటి మురళీకృష్ణ(జనసేన), ప్రకాశం కసిరెడ్డి శ్యామల(టీడీపీ), కాకినాడ ఛైర్మన్‌గా పిచ్చేటి చంద్రమౌళిని(టీడీపీ) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Next Story