- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటాకు చెల్లు.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యాశాఖ(Education Department) గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యాశాఖ(Education Department) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అమలవుతున్న 15 శాతం నాన్ లోకల్, జనరల్ కోటా సీట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు నాన్ లోకల్ కోటా కింద 15 శాతం సీట్లలో తెలంగాణ(Telanagna)కు చెందిన విద్యార్థులకు(Students) అవకాశం కల్పించడం జరిగింది. కానీ.. ఇకపై పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వారికే కేటాయిస్తారని తాజాగా ప్రకటించారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతరులను స్పష్టం చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్(Kona Sashidhar) వేర్వేరుగా మూడు ఉత్తర్వులు(జీవో 20, 21, 22) జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రం(Andhra Pradesh)లో స్థానికత రెండు రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు.






