వేట్లపాలెం ఘటనపై విచారణకు ఆదేశం.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థికసాయం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-28 15:42:29  IST  )

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

వేట్లపాలెం ఘటనపై విచారణకు ఆదేశం.. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఆర్థికసాయం
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు(Vetlapalem Blast incident) సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించి, బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వేట్లపాలెం ఘటన చాలా బాధాకరం. పేలుడు ఘటనతో స్పాట్‌లోనే 21 మంది మృతిచెందారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్లో ఎక్కువగా పేదలే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటాం. ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నాం. డీఎస్పీ, ఆర్డీవో సహా నలుగురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశాం. బాధ్యులపై తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆస్తులను కూడా జప్తు చేస్తాం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఫ్యాక్టరీ నిర్వాహకులు విఫలం అయ్యారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే మరిన్ని చర్యలు తీసుకుంటాం. క్రాకర్స్ ఫ్యాక్టరీల నిర్వహణకు నిబంధనలు కఠినతరం చేస్తాం. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం. బాధితుల పిల్లలను కూడా ప్రభుత్వమే చదివించే విధంగా చర్యలు తీసుకుంటాం, ఇల్లు లేని వారికి ఇళ్లు ఇస్తాం’ అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Next Story