- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు: ఏపీలో పెరిగిన రాజకీయ వేడి.. పుట్టా మహేష్‌ను సస్పెన్షన్‌కు విపక్షాల డిమాండ్
తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొనడం, తాజాగా ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ అని తేలడంతో విపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి.
పాజిటివ్ రిపోర్ట్.. విస్తుపోయిన రాజకీయ వర్గాలు
శనివారం (మార్చి 14) రాత్రి జరిగిన ఈగల్ (EAGLE) టీమ్ దాడుల్లో ఎంపీ పుట్టా మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత నిర్వహించిన యూరిన్ టెస్టులో నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు రక్త నమూనాలను సేకరించారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఎన్‌డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
దీంతో ఆయనపై విపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఆయన్ను పార్టీ తొలగించాలని కాంగ్రెస్, సీపీఎం, వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. చట్టాన్ని గౌరవించే పార్టీ అని చెప్పుకునే టీడీపీ, ఇప్పుడు తన ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే ఎందుకు మౌనంగా ఉందని కాంగ్రెస్, సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే మహేష్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని స్పష్టం చేశారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు MP పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్‌తో విందు చిందు చేస్తున్నాడు. MP పదవి నుంచి పుట్టా మహేష్ ను వెంటనే తొలగించాలి.. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలని షర్మిల డిమాండ్ చేశారు.






