మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కొనసాగతున్న ‘ఆపరేషన్ నేపాల్’

by Thanuru Gopichand |

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది.

మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కొనసాగతున్న ‘ఆపరేషన్ నేపాల్’
X

నేపాల్ లో మొత్తం 217 మంది ఏపీ వాసులు

12 మందితో యూపీ రానున్న తొలివిమానం

లక్నో నుంచి హైదరాబాద్ వచ్చేలా ఏర్పాట్లు

ఉత్తరాంధ్ర వారే ఎక్కువమంది

దిశ, డైనమిక్ బ్యూరో : నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్‌ నుంచి పలువురు యాత్రి కులు కాసేపట్లో రాష్ట్రానికి బయల్దేరనున్నారు. సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లఖ్‌నవూ చేరుకోనున్నారు. లఖన్‌వూ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాఠ్‌మండూ సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేశ్‌ ప్రత్యేక విమానం ఏర్పాటుచేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా నేపాల్‌లో చిక్కుకున్న విజయనగరం జిల్లా వాసులను క్షేమంగా తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మానస సరోవర యాత్ర కోసం విజయనగరం జిల్లా నుంచి 61 మంది నేపాల్వెళ్లారు. వారందరినీ సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యాత్రికుల యోగక్షేమాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫోన్ లో సంప్రదించి తెలుసుకున్నారు. తెలుగువారిని నేపాల్నుంచి తీసుకురావడానికి లోకేష్చేస్తున్న కృషి అభినందనీయం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. నేపాల్బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని చంద్రబాబు, లోకేష్స్పష్టం చేశారని తెలిపారు. ఎదుటివారికి సహాయం చేయడంలో లోకేష్ఎప్పుడూ ముందుంటారని అన్నారు. సోషల్మీడియాలో ఏదైనా సమస్య చూసిన వెంటనే లోకేష్స్పందిస్తారని గుర్తు చేశారు. నేపాల్లో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది ఉత్తరాంధ్ర వారేనని అన్నారు.

Next Story