- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా పతనమైన ఉల్లి ధరలు.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు
కర్నూలు వ్యవసాయ మార్కెట్(Kurnool Agricultural Market)లో ఉల్లి ధరలు(Onion Price) భారీగా పడిపోయాయి...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు వ్యవసాయ మార్కెట్(Kurnool Agricultural Market)లో ఉల్లి ధరలు(Onion Price) భారీగా పడిపోయాయి. 15 రోజుల్లో క్వింటల్‌కు రూ.1000 తగ్గింది. రోజు రోజుకు ఉల్లి ధరలు పతనంకావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొన్నటి వరకూ రూ. 1800 నుంచి రూ.2300 పలికిన క్వింటాల్ ఉల్లి ధర తాజాగా గరిష్టంగా రూ. 1100కు పడిపోయింది. కర్నూలు మార్కెట్‌కు రోజు 700 నుంచి 1000 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. క్వింటా ధర అత్యధికంగా రూ. 1100, కనీస ధర రూ. 505 పలుకుతోంది. దీంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లు కొంత బాగానే ఉన్నా ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే పంటు పండించలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






