Crime News : కొనసాగుతున్న భర్తల మర్డర్స్.. ఏపీలో మరో దారుణం

by Muthe.Rajitha |

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన వివాహితలు తమ భర్తలను సుపారీ ఇచ్చి మరీ మర్డర్(Husband's Murders) చేయిస్తున్నారు.

Crime News : కొనసాగుతున్న భర్తల మర్డర్స్.. ఏపీలో మరో దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన వివాహితలు తమ భర్తలను సుపారీ ఇచ్చి మరీ మర్డర్(Husband's Murders) చేయిస్తున్నారు. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడం ఒక కారణం అయితే, వివాహేతర సంబంధం మరో కారణం అవుతోంది. తాజాగా తెలంగాణలోని గద్వాల పట్టణంలో తేజేశ్వర్ హత్య మరవకముందే పొరుగు రాష్ట్రం ఏపీలోని అనంతపురం(Ananthapuram)లో ఇలాంటిదే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆ ప్రియుని చేతే చంపించింది ఓ మహిళ. ఆనంతరపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని అక్కంపల్లిలో నివాసం ఉండే సురేష్ బాబు(43), భార్య అనిత(37)తో కలిసి అక్కంపల్లి-రాచానపల్లి రోడ్డులో చిన్న హోటల్ నడుపుతున్నాడు.

ఈ క్రమంలో అనితకు ఊరూరా తిరిగి పండ్లు అమ్ముకునే ఫక్రుద్దీన్(34) తో పరిచయం ఏర్పడి, అదికాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. సురేష్ బాబుకు అనుమానం రావడంతో ప్రతిరోజు తాగివచ్చి అనితను వేధించడంతో.. ఎలాగైనా తన భర్తను చంపేయమని ప్రియుడు ఫక్రుద్ధీన్ కు సూచించింది. దీంతో మంగళవారం రాత్రి హోటల్ మూసి ఇంటికి వస్తున్న సురేష్ బాబుపై ఫక్రుద్ధీన్ బండరాయితో బాది హత్య చేసి, పరారయ్యాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారిస్తే అసలు నిజం బయటపడింది. ఈకేసులో అనితను, ఫక్రుద్ధీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story