కల్తీ పాల ఎఫెక్ట్.. ఆస్పత్రిలో చేరిన మరో మహిళ

by Ajay Maddhiboyina |

రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో మహిళ సైతం అస్వస్థతకు గురయ్యారు. ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు.

కల్తీ పాల ఎఫెక్ట్.. ఆస్పత్రిలో చేరిన మరో మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాల కలకలం రేగిన సంగతి తెలిసిందే. నగరంలోని చౌడేశ్వరినగర్, వెంకటేశ్వర నగర్ వాసులు కల్తీ పాలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా ఇప్పటికే నలుగురు చనిపోగా, ఇద్దరు వెంటిలేటర్ పై ఉన్నారు. మరో 8మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పుడు మరో మహిళ సైతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ఆదిలక్ష్మి అనే మహిళ అస్వస్థతకు గురవ్వడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ సైతం కిడ్నీ సమస్యతో బాధపడుతోందని వైద్యులు వెల్లడించారు. బాధితులు అంతా కోరుకొండ మండలం, నరసాపురం గ్రామం వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుండి పాలు తీసుకున్నవారే. ఈ డెయిరీ నుండి 106 కుటుంబాలకు ప్రతిరోజు పాల సరఫరా అవుతుంది. ఇక ఇప్పటికే వచ్చిన క్లినికల్ రిపోర్డుల్లో బాధితుల్లో రక్తం, యూరియా, సీరమ్ క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్టు వైద్యులు గుర్తించారు.

Next Story