- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల పరాకమణిలో వంద కోట్లు దోచుకున్నారు : మంత్రి పార్థసారథి
వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుమల (Tirumala) పరాకమణిలో వంద కోట్లు దోచుకున్నారని రాష్ట్ర మంత్రి కొలుసుల పార్థసారథి (Kolusula Parthasarathy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుమల (Tirumala) పరాకమణిలో వంద కోట్లు దోచుకున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి (Kolusula Parthasarathy) ఆరోపించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కానుకలను సమర్పిస్తారన్నారు. వాటిని ధార్మిక ప్రచారానికి, పేదల సంక్షేమానికి వినియోగిస్తారని మంత్రి అన్నారు. కానీ పరకామణిలో వంద కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడనే వార్త బాధాకరంగా ఉందన్నారు. దొంగతనం 29 ఏప్రిల్ 2023లో రాత్రి 11 గంటలకు జరిగిందన్నారు. దానిపై నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారని గుర్తు చేశారు. క్రైమ్ నెంబర్ 19-2023 సెక్షన్స్ 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తిరుపతిలో దొంగతనం చేశారనే మాటనే ప్రజలు జీర్ణించుకోలేరన్నారు. వంద కోట్లు తినేసిన కేసును ఓ విజిలెన్స్ అధికారి రిజిస్టర్ చేస్తే.. దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో.. ఏ విధంగా కేసుపై చర్యలు తీసుకుందో ఆలోచిస్తే అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసే పనేనా లేక దోపిడీ ముఠాలు చేసే పనా అనే అనుమానాలు కలుగుతాయన్నారు. టీడీపీ ప్రభుత్వం పరాకమణి చోరీ కేసు విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు.






