- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Fiber Net : ఏపీ కేబుల్ ఆపరేటర్లకు వంద కోట్ల ఊరట!
ఏపీ ఫైబర్ నెట్(AP Fiber Net)సంస్థ రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల(Cable Operators)కు భారీ గుడ్ న్యూస్(Huge Good News)చెప్పింది. కేబుల్ ఆపరేటర్ల

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఫైబర్ నెట్(AP Fiber Net)సంస్థ రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల(Cable Operators)కు భారీ గుడ్ న్యూస్(Huge Good News)చెప్పింది. కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల పెనాల్టీల(Rs. 100 Crore Penalties)ను రద్దు(Cancellation) చేస్తున్నట్లుగా ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్(AP Fiber Net Chairman)జీ.వీ.రెడ్డి(G.V.Reddy) వెల్లడించారు. సెటాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్ కు నెలకు రూ.59 చొప్పున రెంట్(Connection Rent) కూడా రద్దు చేస్తున్నామని. ఇకపై కనెక్షన్ లపై రెంట్లను వసూలు(Cancellation) చెయ్యబోమని ప్రకటించారు.
అలాగే తిరుమల కొండపై అన్ని ఆఫీసులు, షాపులు, ఇళ్లకు ఉచితంగా ఫైబర్ నెట్ కనెక్షన్లు అందజేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై కక్ష పూరితంగా అడ్డగోలుగా రూ.100కోట్ల జరిమానాలు విధించిందని..దీనిపై విచారణ జరిపి జరిమానాలను రద్ధు చేయాలని నిర్ణయించామని జీ.వీ.రెడ్డి తెలిపారు. అలాగే సంస్థ విస్తరణలో ఇప్పటికే తొలగించిన 600మంది స్థానంలో కొత్త ఉద్యోగులను నియమిస్తామన్నారు. రాజకీయ కొలువుల మాదిరిగా కాకుండా నియామకాలను పారదర్శకంగా చేస్తామన్నారు.
సంస్థ అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ ప్రయత్నాలు ప్రారంభించామని..రెండు నెలల్లో రుణాలు తీసుకుని సంస్థ విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. సైబర్ నెట్ ప్లాన్స్ కూడా రివైజ్ చేస్తామని, గ్రామాల్లో అందరికి తక్కువ ధరకు బేసిక్ ప్యాకేజీ అందుబాటులోకి తెస్తామన్నారు.






