YCP: అడుసు తొక్కనేల..? అమరావతి అంశంలో మరోసారి ఆ పార్టీకి డ్యామేజి!

by Thanuru Gopichand |

అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అన్న చందంగా ఉంది ఇప్పడు ఏపీలో వైసీపీ పని..! అమరావతి అంశంపై ఆ పార్టీ మరోసారి ఇరుకున పడింది.

YCP: అడుసు తొక్కనేల..? అమరావతి అంశంలో మరోసారి ఆ పార్టీకి డ్యామేజి!
X

అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు

రాజధాని మహిళలో ఆగ్రహ జ్వాలలు

ఆ వ్యాఖలతో తమకేం సంబంధం అంటున్న వైసీపీ

అమరావతి అంశంలో మరోసారి ఆ పార్టీకి డ్యామేజి!

ఆదినుంచి అదే వైఖరి అంటున్న టీడీపీ

దిశ, డైనమిక్ బ్యూరో : అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అన్న చందంగా ఉంది ఇప్పడు ఏపీలో వైసీపీ (YCP) పని..! అమరావతి అంశంపై ఆ పార్టీ మరోసారి ఇరుకున పడింది. తమ అనుకూల చానల్లో రాజధాని (Rajadhani) మహిళలపై ఓ పాత్రికేయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రాజధానిలో దుమారం రేగింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడుతూ.. ఆ వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆ ఛానల్ ప్రకటించినా వివా దం సద్దుమనగలేదు. అమరావతిపై (Amaravathi) అక్కసులోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజధాని మహిళలు నిన్నంతా ఆందోళన చేపట్టారు. వైసీపీ వర్గాలు సైతం ఆ వ్యాఖ్యలు ఖండించిన అప్పటికే పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రాజధాని అమరావతిపై వైసీపీ మొదటి నుంచి పూర్తి డైలమాలో ఉంది. పూటకో మాట చెబుతూ అక్కడి ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. 2019 ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుంటానని, అమరావతికే తమ మద్దతు అంటూ ప్రకటించిన వైఎస్ జగన్ (YS Jagan), గెలిచిన తర్వాత మాట మార్చాడు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి గందరగోళానికి గురిచేశారు. అమరావతి శ్మశానం.. ఎడారి అంటూ ఆ పార్టీ ముఖ్యులు వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణ పనులను పట్టించుకోలేదు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత ఆ పార్టీకొ కొంత జ్ఞానోదయం అయినట్లు ఉంది. దీంతో అమరావతిపై ఆచితూచి మాట్లాడుతున్నారు. నిన్నటి ఘటన జరగడానికి ముందు మాజీ మంత్రి జోగి రమేష్​ అమరావతిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే అంటూ చెప్పుకొచ్చారు.

మొన్నటి చానల్​డిబేట్​లో ఓ జర్నలిస్టు అమరావతి మహిళలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. ఎన్నికలు గడిచి ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ తన వైఖరిని కచ్చితంగా వెలిబుచ్చాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోవడం కార్యకర్తలను కూడా అయోమయానికి గురిచేస్తోందని పలువురు ఎనలిస్టులు అంటున్నారు. లేదంటా ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో ఆ పార్టీపై ఉన్న సానుభూతి కూడా ప్రజల్లో తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా జగన్​అమరావతిపై తన వైఖరిని చ స్పష్టంగా చెబుతారో.. లేదో చూడాలి మరి..!

Next Story