- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఏపీకి వర్షం గండం.. దూసుకొస్తున్న వాయుగుండం
వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాలతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాలతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా గోదావరి నదులు (Krishna Godavari rivers) పొంగి పోర్లుతుండటం, దీనికి తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది ఏపీలో వరుసగా వరదలు (floods) సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదల నుంచి తేరుకునేలోపే.. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం (low pressure) వచ్చే 12 గంటల్లో వాయుగుండం (Vayugundam)గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది. ఈ వాయుగుండం సెప్టెంబర్ 27న ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకనుందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
నేడు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారుల సూచనల ప్రకారం, రేపు ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు కోస్తా ఆంధ్రాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వాయుగుండం (Vayugundam) ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు (Warnings) జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 30 వరకు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.






