మేయర్​పీఠంపై.. కూటమి కన్ను.. గుంటూరులో పొలిటికల్​ హీట్​!

by Anil Sikha |
మేయర్​పీఠంపై.. కూటమి కన్ను.. గుంటూరులో పొలిటికల్​ హీట్​!
X

దిశ, డైనమిక్​బ్యూరో : గుంటూరు నగర మేయర్​అభ్యర్థిని కూటమి ప్రకటించడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. మేయర్​ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర అంటూ ఎంపీ పెమ్మసాని ప్రకటించడం హాట్​టాపిక్​గా మారింది. తాజాగా ఆరు స్టాండింగ్​ కమిటీ పదవులు దక్కించుకున్న కూటమి .. ఇప్పుడు ఏకంగా మేయర్​ పదవిపై కన్నేసింది. ప్రస్తుతం గుంటూరు నగర మేయరుగా కావటి మనోహర్​నాయుడు ఉన్నారు. గడచిన మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 57 స్థానాలకు 48 మంది వైసీపీ కార్పొరేటర్లు, 9మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో 20 మంది కార్పొరేట్లర్లు టీడీపీలో చేరారు. దీంతో కూటమికి బలం చేకూరింది. ఈ క్రమంలోనే స్టాండింగ్​ కమిటీ ఎన్నికల్లో స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నాని పేరును ప్రకటించడం.. మేయర్​ పదవికి కూటమి పావులు కదుపుతుందనే వార్తలకు బలం చేకూరింది. 37 వ డివిజన్ కార్పొరేటర్ కోవెలమూడి రవీంద్ర 2004 నుంచి ఆయన పార్టీ లో చురుకైన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. పలు మార్లు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ఆయన పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసారు. మంత్రి లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అధిష్టానం నానిని మేయర్​అభ్యర్థిగా ప్రటించారు. మార్చి 18 తో ప్రస్తుత మేయర్ కావటి మనోహర్ నాయుడు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ పదవి నుంచి దించనున్నట్లు సమాచారం.

Next Story