Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో.. ఏపీలో గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్

by Ramesh Naini |

రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు-2027 కోసం ప్రభుత్వం సిద్ధమైంది.

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో.. ఏపీలో గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు-2027 కోసం ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే ఈ గోదావరి పుష్కరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తున్నారు. ఈ మేరకు గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్ అయింది. 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగమ, వైదిక పండితుల ఏకాభిప్రాయంతో దేవదాయ శాఖ శనివారం ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

గోదావరి పుష్కరాలను ఏయే తేదీల్లో నిర్వహించాలనే దానిపై ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులు, టీటీడీ ఆస్థానం సిద్ధాంతితో కలిపి మొత్తం 16 మంది పాల్గొన్న సమావేశంలో పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు నివేదిక తయారు చేసి తాజాగా ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకొని, నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంది. గత పుష్కరాలు 2015 లో జులై 14 నుంచి 25 వరకు జరిగాయి. ఈ సారి కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story