ఆ రోజే.. ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల

by Disha Web Desk 1 |
ఆ రోజే.. ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపిరిలూదేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవలే వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వై.ఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా 21న ఉదయం 10 గంటలకు బాధ్యతలు చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, నాయకులు, వివిధ రాష్ర్టాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Next Story

Most Viewed