'గోదావరి'పై.. రైల్వే బ్రిడ్జ్.! రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్

by Geesa Chandu |   (  Updated:2024-08-10 13:03:27  IST  )

భారత్ లోని అనేక రాష్ట్రాలను కలుపుతూ వెళ్ళే.. హౌరా - చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.

గోదావరిపై.. రైల్వే బ్రిడ్జ్.! రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లోని అనేక రాష్ట్రాలను కలుపుతూ వెళ్ళే.. హౌరా - చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మొదటి దశలో 3 లైన్ల కారిడార్ కు ఆమోదం లభించింది. అయితే తదుపరిగా మొత్తం 4 లైన్ల కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంలో తెలిపారు. ఈ కారిడార్ ముఖ్య ఉద్దేశం - దక్షిణాది రాష్ట్రాలలోని విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలోని బొగ్గుని తెలంగాణతో పాటుగా.. దక్షిణాదిన ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు తరలించటానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కారిడార్ నిర్మాణంతో 5 లక్షల 700 కి. మీ దూరం తగ్గనున్నట్లు తెలిపారు.

గోదావరి మీదుగా కారిడార్..

ఈ కారిడార్ యొక్క రైల్వే లైన్ గోదావరి నదీ మీదుగా వెళ్తుందనీ.. అందుకుగానూ నదిపైన ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. నదిపైన ఈ రైల్వే లైన్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను కలుపుతూ సాగుతుందని, దానికోసం ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా టన్నెల్స్ ను కూడా నిర్మిస్తామని, కోస్టల్ ఏరియాలో తుఫానులు చెలరేగినప్పుడు ఈ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Next Story