Breaking: కర్నూలు జిల్లాలో ఇద్దరు దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి..

Breaking: కర్నూలు జిల్లాలో ఇద్దరు దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District)లో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఎమ్మిగనూరు మండలం కంధనాతి(Kandhanati)లో ఇద్దరు వ్యక్తులు(Two Mans) దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు వెంకటేశ్, పరమేశ్, గోవింద్‌ను సోమవారం ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికారు. ఈ దాడిలో వెంకటేశ్, పరమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా గోవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంటకేశ్, పరమేశ్ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. గోవింద్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవింద్ స్టేట్ మెంట్‌ను రికార్డు చేసినట్లు సమాచారం. ఈ కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు.

Next Story