- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. వారికి అధికారుల వార్నింగ్!
మెగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది.

దిశ,వెబ్‌డెస్క్: మెగా డీఎస్సీ అభ్యర్థులకు కీలక ప్రకటన వెలువడింది. ఏపీ(Andhra Pradesh)లో మెగా డీఎస్సీ(Mega DSC) ఫలితాలను ఇప్పటికే అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే.. ర్యాంకులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఈ నెల(ఆగస్టు) 22వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి వెబ్‌సైట్ లో ఉంచనున్నారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్ జాబితాను చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీచర్ జాబ్ ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులను నమ్మొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. వదంతులు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






