- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి మృతి.. కన్నెత్తి చూడని కొడుకు.. చందాలతో అంత్యక్రియలు చేసిన అధికారులు
కట్టుకున్న భార్య ముందే మరణించింది. బెంగతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరి అతను కూడా కన్నుమూశాడు.

దిశ, వెబ్ డెస్క్ : కట్టుకున్న భార్య ముందే మరణించింది. బెంగతో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చేరి అతను కూడా కన్నుమూశాడు. తలకొరివి పెట్టాల్సిన కొడుకు మద్యం మత్తులో మునిగితేలి, తండ్రి శవం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అధికారులు, గ్రామస్తులే చందాలు వేసుకొని అంత్యక్రియలు జరిపిన అమానవీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చీరాల శ్రీనివాసరావు, అన్నపూర్ణ భార్యాభర్తల కుమారుడు సురేశ్. అయితే మూడు నెలల క్రితం తల్లి అన్నపూర్ణ మరణించింది. తండ్రి శ్రీనివాసరావు అనారోగ్యంతో మంచం పట్టగా.. పర్చూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి వెళ్లిపోయాడు. తీవ్రంగా అస్వస్థతకు గురై శ్రీనివాసరావు ఈనెల 7న మరణించినా కొడుకు మద్యానికి బానిసై కన్నెత్తి చూడలేదు.
బంధువులు కూడా ఎవరూ రాకపోగా ఆస్పత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొడుకును, బంధువులను పిలిచి కౌన్సిలింగ్ ఇఛ్చినప్పటికీ.. తమవద్ద అంత్యక్రియలకు డబ్బులు కూడా లేవు అని చెప్పడంతో పోలీసులు, పంచాయతీ అధికారులు తమవంతు ఆర్థిక సాయం అందించి, అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.






