- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల
by Naga Rani Yarlagadda |
శ్రీశైలం ప్రాజెక్ట్.. (Srisailam Project) పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్ట్.. (Srisailam Project) పర్యాటకులకు కనువిందు చేస్తోంది. జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో నిన్న ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు.. నేడు రెండో రేడియల్ క్రస్ట్ గేటును కూడా 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 55,048 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,948 క్యూసెక్కులను అదనంగా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు.
ఇక ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్ట్ నుంచి 39,168, సుంకేసుల జలాశయం నుంచి 36,975 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. కాగా.. శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి 883.80 అడుగులుగా ఉండగా.. 208 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Next Story






