ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.: ఈ 23 మండలాలకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే సోమవారం ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ..

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.: ఈ 23 మండలాలకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అయితే సోమవారం ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 మండలాల్లో తీవ్రమైన ఎండలు, మరో 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో నిప్పుల కొలిమిని తలపించే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల జాబితాను అధికారులు విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు సహా దాదాపు 15 మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రామభద్రాపురం వంటి 8 మండలాల్లోనూ ఎండల తీవ్రత తీవ్రస్థాయిలో ఉండనుంది. వీటితో పాటు కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లోనూ వేడి గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

ప్రజలు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా గొడుగులు లేదా టోపీలు ధరించాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

Next Story