- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భయపడాల్సిందేం లేదు.. సుబ్బరంగా చికెన్ తినేయండి’
బర్డ్ ఫ్లూ(Bird Flu) భయంతో గతకొంతకాలంగా చికెన్(Chicken) తినాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బర్డ్ ఫ్లూ(Bird Flu) భయంతో గతకొంతకాలంగా చికెన్(Chicken) తినాలంటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చికెన్ స్థానంలో మటన్(Mutton), ఫిష్(Fish) తినేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లా(Godavari Districts)ల్లో చికెన్ షాపులు మూతపడే పరిస్థితికి వచ్చాయి. దీంతో పశుసంవర్దక శాఖ అప్రమత్తమైంది. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత చాలా తక్కువుందని.. ప్రజలు అనవసరంగా తప్పుడు వదంతులు నమ్మొద్దని పశుసంవర్దక శాఖ(Department of Animal Husbandry) డైరెక్టర్ దామోదర్ నాయుడు సూచనలు చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చికెన్ వినియోగంపై మేళాలు నిర్వహిస్తామని అన్నారు. చికెన్‌తో పాటు ఎగ్ మేళాలు సైతం నిర్వహిస్తామని వెల్లడించారు. చికెన్, గుడ్లు(EGGs) తినకూడదనే అపోహలు నమ్మొద్దని అన్నారు. కోళ్లఫాముల్లో బయో సెక్యూరిటీ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు.. బర్డ్‌ఫ్లూపై లేనిపోని భయాలు సృష్టించడం వల్ల ఎక్కువమంది చికెన్, గుడ్లు తినడం మానేశారు. ఫలితంగా కోళ్లు, గుడ్ల ధరలు బాగా పడిపోయాయి. దీంతో రాష్ట్రంలో పౌల్టీరంగం(Poultry Sector) తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. రాష్ట్రంలో దాదాపు 8.5 కోట్లకుపైగా కోళ్లున్నాయి. ఇందులో బాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు 4 కోట్ల చొప్పున ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కారణగా అమ్మకాలు ఆందోళనకరరీతిలో పడిపోవడంతో కోళ్ల పెంపకందారులు దిక్కుతోచనిస్థితిలో పడిపోయారు. కొన్నిరోజుల కిందట లైవ్‌కోడి కిలోధర రూ.180 పలికితే ఇప్పుడు రూ.90కి పడిపోయింది. రూ.5:50 చొప్పున అమ్ముడుపోయిన గుడ్లు ఇప్పుడు రూ.3.50కు పడిపోయాయి. కొత్తగా ఎవరూ కోళ్లపెంపకం చేపట్టడంలేదు. దీంతో పరిస్థితి మరింత చేదాటక ముందే అధికారులు అప్రమత్తం అయ్యారు.






