అర్ధరాత్రి వృద్ధురాలు క్షుద్ర పూజలు: సత్యసాయి జిల్లాలో కలకలం

by Vemula.Srinu Prasad |

సత్యసాయి జిల్లాలో శనివారం అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలు చేసిన పని ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. .. ఒక దుకాణం ముందు ఎవరూ లేని సమయంలో ప్రత్యక్షమైన సదరు మహిళ.. పసుపు, కుంకుమ, అగరబత్తులతో దాదాపు అరగంట పాటు వింత పూజలు నిర్వహించింది.

అర్ధరాత్రి వృద్ధురాలు క్షుద్ర పూజలు: సత్యసాయి జిల్లాలో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లాలో శనివారం అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలు చేసిన పని ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక దుకాణం ముందు ఎవరూ లేని సమయంలో ప్రత్యక్షమైన సదరు మహిళ.. పసుపు, కుంకుమ, అగరబత్తులతో దాదాపు అరగంట పాటు వింత పూజలు నిర్వహించింది. ఆదివారం ఉదయం షాపు తెరిచేందుకు వెళ్లిన యజమాని.. అక్కడ పడి ఉన్న పూజా సాగ్రిగిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే సిసిటివి (CCTV) దృశ్యాలను పరిశీలించారు. ఓ వృద్ధురాలు చేసిన క్షుద్ర పూజల వంటి దృశ్యాలు బయటపడటంతో ఒక్కసారిగా భయపడిపోయారు.

ఆ వృద్ధురాలు ఎవరు..?

అయితే యజమాని, స్థానికులు సదరు మహిళ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినప్పటికీ, ఆమె జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరోవైపు ఆమె ప్రవర్తన, అర్ధరాత్రి పూజలు చేసిన తీరును బట్టి మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూఢనమ్మకాలతోనో లేదా మానసిక స్థితి సరిగా లేకనో ఆమె ఇలా చేసి ఉంటుందని భావిస్తున్నప్పటికీ, అసలు ఆమె ఎవరు?. ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది ప్రస్తుతం ఆ ప్రాంతంలో మిస్టరీగా మారింది.

Next Story