నడిరోడ్డుపై క్షుద్రపూజలు.. సత్యసాయి జిల్లాలో కలకలం

by Vemula.Srinu Prasad |

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శివపురం సమీపంలో క్షుద్రపూజలు కలకలం రేగింది...

నడిరోడ్డుపై  క్షుద్రపూజలు.. సత్యసాయి జిల్లాలో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శివపురం(Madakasira Sivapuram) సమీపంలో క్షుద్రపూజలు(Occultism) కలకలం రేగింది. భారతి అనే మహిళ వాట్సప్ ఫోటోతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు భయంకరంగా నిర్వహించారు. రోడ్డుపై భారీగా పెట్టి నాలుగు మేకులు, నిమ్మకాయలు, కోడిగుడ్ల పెట్టి పసుపు, కుంకమ చల్లి పూజలు చేశారు. ఈ రోజు అమావాస్య కావడంతో రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. దీంతో పోలీసులకు బాధితులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మాట్లాడుతూ తన ఫోన్‌ వాట్సప్ స్టేటస్‌లో పెట్టిన ఫొటోను తీసుకుని మూడు రోడ్లు కలిసిన చోట క్షుద్రప్రయోగాలు చేశారని వ్యాఖ్యానించారు. నిందితులను పోలీసులు గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఐదుగురు పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటున్న తనను చెడగొట్టేందుకే ఈ పూజలు చేశారని ఆరోపించారు. తనపై క్షుద్రపూజలు ఎవరు చేశారో తమకు తెలియాలని బాధితురాలు భారతి కోరారు.

Next Story