పవన్ కల్యాణ్‌పై NTR సతీమణి లక్ష్మీపార్వతీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2024-03-01 14:33:59  IST  )

ఎన్నికలకు రెండు నెలల ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడేక్కాయి. విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో నేతలు పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై NTR సతీమణి లక్ష్మీపార్వతీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలకు రెండు నెలల ముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడేక్కాయి. విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో నేతలు పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేత నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దివంగత సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయిన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.

కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఔట్ సోర్సింగ్ లాంటివారని సెటైర్ వేశారు. సీఎం జగన్‌పై పవన్ ఒళ్లంతా ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. కాగా, ఇటీవల టీడీపీ, జనసేన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో టీడీపీ చీఫ్ బాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో బాబు, పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

Read More..

‘కాపు’ కోట నుంచి కీలక వ్యక్తి ఔట్... జనసేనకు వరుస దెబ్బలు

Next Story