- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు

X
దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో టీడీపీ మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు తెలిపారు. రేపు(బుధవారం) నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటల తర్వాత మహానాడులో ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని తెలిపారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహానాడులో ప్రకటించాలని కోరారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఆయన తనను తాను నిరూపించుకున్నారని మంత్రులు మహానాడు వేదికగా పేర్కొన్నారు.
Next Story






