మళ్లీ తెరపైకి రఘురామ టార్చర్‌ కేసు.. IPS అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

by Ajay Maddhiboyina |

వైసీపీ హ‌యాంలో ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశారంటూ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసులో పురోగ‌తి లేక‌పోగా తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ అప్పుడు సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన‌ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌కు నోటీసులు అంద‌జేశారు.

మళ్లీ తెరపైకి రఘురామ టార్చర్‌ కేసు.. IPS అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ హ‌యాంలో ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ చేశారంటూ కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా ఈ కేసులో పురోగ‌తి లేక‌పోగా తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ అప్పుడు సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన‌ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌కు నోటీసులు అంద‌జేశారు. డిసెంబ‌ర్ 4వ తేదీన గుంటూరులోని సిట్ కార్యాల‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే సునీల్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టి హైద‌రాబాద్ లో అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారని ర‌ఘురామ ఆరోపించారు. నోటీసులు కూడా ఇవ్వ‌కుండా మీడియాతో మాట్లాడుతున్నాన‌ని దేశ‌ద్రోహం కేసులు పెట్టిన‌ట్టు ఆరోపించారు.

గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లి రాత్రంతా కొట్టార‌ని.. సునీల్ కుమార్ త‌న‌ను కొడుతూ అప్ప‌టి సీఎం జ‌గ‌న్ కు లైవ్ చూపించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఐడీ ఆఫీసు నుండి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే కోర్టులో ర‌ఘురామ ఈ ఆరోప‌ణ‌లు చేశారు. ఇక ప్ర‌భుత్వం మారిన త‌ర‌వాత త‌న కేసుపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ర‌ఘురామ గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. దీంతో కేసు న‌మోదు చేయ‌గా ప్ర‌త్యేక సిట్ నియ‌మించారు. ఈ కేసులో కొంద‌రిని అరెస్ట్ కూడా చేశారు. కాగా ఇప్పుడు సునీల్ కుమార్ కు నోటీసులు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విచార‌ణ త‌ర‌వాత అస‌లు ఏం జ‌రిగింది అనే నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా దాడి నిజ‌మైతే ఎవ‌రెవ‌రిని అరెస్ట్ చేస్తారు అన్న‌ది కూడా హాట్ టాపిక్ గా మారింది.

Next Story