కర్నూలు బస్సు దగ్దం కేసులో వైసీపీ నేతకు నోటీసులు

by Ajay Maddhiboyina |

క‌ర్నూలు బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న‌పై అస‌త్యాలు ప్ర‌చారం చేశార‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (మీడియా) పూడి శ్రీహ‌రికి నోటీసులు అంద‌జేశారు. బస్సు దగ్దానికి మద్యం కారణమని ప్రచారం చేశారంటూ శ్రీహ‌రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే నోటీసులు ఇచ్చారు.

కర్నూలు బస్సు దగ్దం కేసులో వైసీపీ నేతకు నోటీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నూలు బ‌స్సు ద‌గ్ధం ఘ‌ట‌న‌పై అస‌త్యాలు ప్ర‌చారం చేశార‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (మీడియా) పూడి శ్రీహ‌రికి నోటీసులు అంద‌జేశారు. బస్సు దగ్దానికి మద్యం కారణమని ప్రచారం చేశారంటూ శ్రీహ‌రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 27 మందిపై పోలీసులు చర్యలు తీసుకోగా, తాజాగా శ్రీహరిని కూడా చేర్చారు. ఇదిలా ఉంటే క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంలో 19 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు.

వేమూరి ట్రావెల్స్ కు చెందిన బ‌స్సు బెంగుళూరు నుండి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. డివైడ‌ర్ ను ఢీ కొట్టి ప‌డిపోయిన బైక్‌ను ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరినట్టు దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి ముందు బైక్ రైడర్ వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి తాగగా, అర్ధరాత్రి తరవాత కూడా బెల్టు షాపుల్లో మద్యం అమ్ముతున్నారని కొందరు ప్రచారం చేశారు. బెల్డు షాపుల కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారం చేసిన నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపైనా కేసు నమోదు చేశారు.

Next Story