ప్రజలు కొద్ది నెలల క్రితమే జగన్‌కు ఆ పని చేశారు.. మంత్రి అనగాని హాట్ కామెంట్స్

by Ramesh Goud |

జగన్ ఒక సైకోలా మాట్లాడుతున్నారని, పోలీసుల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Sathyaprasad) అన్నారు.

ప్రజలు కొద్ది నెలల క్రితమే జగన్‌కు ఆ పని చేశారు.. మంత్రి అనగాని హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జగన్ ఒక సైకోలా మాట్లాడుతున్నారని, పోలీసుల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Sathyaprasad) అన్నారు. మాజీ సీఎం జగన్ (Former CM Jagan) రాప్తాడు (Rapthadu)లో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు 9 నెలల క్రితమే బట్టలూడదీశారని మాజీ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు మళ్లీ పోలీసుల బట్టలూడదీస్తామని మాట్లాడటం బాధాకరంగా ఉందని అన్నారు.

గత ఐదేళ్ల రాక్షస పాలనలో జగన్ ఒక సైకో (Psycho)లా వ్యవహరించారని, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన వారిపై కూడా కేసులు నమోదు చేశారని, అమరావతి రైతులకు సంకెళ్లు వేశారని తెలిపారు. అలాంటి పాలన జరగకూడదని చూస్తుంటే, ఈ సైకో జగన్ ఇలాంటి మాటలు మాట్లాడితే.. 11 కాదు పక్కన 1 కూడా పోతుందని అన్నారు. అనంతపూర్ లో జరిగిన చిన్న ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని, చంద్రబాబు పాలనలో రాజకీయ కక్ష్యలు ఉండవని తెలిపారు. గతంలో పేద ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్లపై మాత్రమే కేసులు పెడుతున్నారని, రాజకీయ కక్ష్యతో కాదని అన్నారు.

అలాగే జగన్ ఇలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ వ్యాఖ్యలపై పోలీసు సంఘాలు స్పందించాలని, పోలీస్ సంఘాలకు తమ మద్దతు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఇలాంటి అరాచక సంఘటనలు జరకుండా ఉండటానికి ప్రయత్నిస్తామని అనగాని వెల్లడించారు. కాగా రాప్తాడులో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandrababu) మెప్పుకోసం కొందరు పోలీసులు (Police) వాచ్‌మెన్లు (Watchmen)గా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి పోలీసులకు చెబుతున్నా.. ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన సాగదని, మీ యూనిఫాం తీయించి.. దోషులుగా మిమ్మల్ని నిలబెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక మీరు చేసిన ప్రతి పనినీ వడ్డీతో సహా లెక్కేసి మీతోనే కక్కిస్తామని జగన్ వ్యాఖ్యానించారు.

Next Story