- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెడ్ బుక్‌కు నేనే కాదు.. నా కుక్క కూడా భయపడదు: మాజీ మంత్రి అంబటి రాంబాబు
లోకేశ్ (Lokesh) రెడ్‌బుక్‌కు తాను కాదు.. తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: లోకేశ్ (Lokesh) రెడ్‌బుక్‌కు తాను కాదు.. తన కుక్క కూడా భయపడదని వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్‌కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారని కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. తాను అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. జైల్లో పెట్టుకుంటాడో, దొంగ కేసులు కడతాడో, పోలీసులతో కొట్టిస్తాడో లోకేశ్ ఇష్టమని సెటైర్లు వేశారు. ఇవాళ పవర్ ఉందని పండగ చేసుకుంటే.. రాబోయే రోజుల్లో ప్రతిఫలం అనుభవించక తప్పదని అన్నారు. కక్ష సాధించే క్రమంలో లోకేశ్ తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైం అంబటి రాంబాబు అన్నారు.






