- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోర్నడో కాదు.. అనకాపల్లిలో ఆకాశాన్ని తాకిన భారీ సుడిగుండం!
స్థానిక ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఒక్కసారిగా టోర్నడో తరహా సుడిగుండం ప్రత్యక్షమై బీభత్సం సృష్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అనకాపల్లి పట్టణంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో (NTR Stadium) ఒక్కసారిగా టోర్నడో తరహా సుడిగుండం ప్రత్యక్షమైంది. సుమారు 100 అడుగుల ఎత్తులో గాలి సుడులు తిరుగుతూ ధూళి మేఘాన్ని ఆకాశం వైపు తీసుకెళ్లడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
భయాందోళనలో స్థానికులు..
సాధారణంగా అమెరికా వంటి దేశాల్లో కనిపించే టోర్నడోలను తలపించేలా ఈ సుడిగుండం ఏర్పడటంతో స్టేడియం పరిసరాల్లో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘మా జీవిత కాలంలో అనకాపల్లిలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వాతావరణ నిపుణుల విశ్లేషణ..
ఈ అరుదైన ఘటనపై వాతావరణ నిపుణులు స్పందిస్తూ.. దీనిని 'డస్ట్ డెవిల్' (Dust Devil) గా పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండల వల్ల భూమి ఉపరితలం అధికంగా వేడెక్కినప్పుడు, అక్కడి గాలి వేగంగా పైకి లేస్తుంది. పైనున్న చల్లని గాలి కిందకు రావడానికి ప్రయత్నించినప్పుడు ఏర్పడే పీడన వ్యత్యాసం వల్ల గాలి ఇలా సుడులు తిరుగుతూ పైకి వెళ్తుంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా, ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఆ ధూళి సుడిగాలిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.






