రాష్ట్రంలో బలహీనపడిన ఈశాన్య రుతుపవనాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-23 01:20:48  IST  )

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనపడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో బలహీనపడిన ఈశాన్య రుతుపవనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు బలహీనపడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు రావడం లేదని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రానున్న ఐదారు రోజుల వరకూ రాష్ట్రంలో ఇదే వాతావరణం ఉంటుందని స్పష్ట చేసింది. దీని ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో చలితీవ్రత కొనసాగుతుందని తెలిపింది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో అజాగ్రత్త తగదని వారించింది. రానున్న రెండు, మూడు రోజులపాటు చలిప్రభావం కొనసాగుతుందని, మంచు కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది.

Next Story