మాజీ మంత్రి జోగి రమేశ్‌‌కు షాక్.. మరో నాన్ బెయిలబుల్ కేసు

by Naga Rani Yarlagadda |

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి జోగి రమేశ్‌‌కు షాక్.. మరో నాన్ బెయిలబుల్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్.. జోగి రమేశ్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో జనసమీకరణ, ర్యాలీలు చేయవద్దని పోలీసులు కఠిన నిబంధనలు విధించినా.. వాటిని ఉల్లంఘించారని జోగి రమేశ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయింది. ఎస్ ఐ రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

శుక్రవారం జరిగిన జగన్ పర్యటనలో జోగి రమేశ్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి, జన సమీకరణ చేపట్టి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని తెలిపారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. జనసమీకరణ చేయవద్దని ముందే నోటీసులు ఇవ్వగా.. వాటిని ఉల్లంఘించారని, పోలీసుల సూచనలను బేఖాతరు చేశారని తెలిపారు. ఈ కేసులో జోగి రమేశ్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారా? నెక్స్ట్ ఏం జరుగుతుందన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదవ్వగా.. నిన్న హైకోర్టు ఆయనపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు.. తిరుపతి జిల్లా తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. గతేడాది నవంబరులో కల్తీ మద్యం కేసు నమోదవ్వగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబుపై అనుచిత్ర వ్యాఖ్యలు చేసిన దానిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

Next Story