- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: నామినేషన్లు దాఖలు చేసిన చంద్రబాబు, పురంధేశ్వరి
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం మంచి రోజు అనే సెంటిమెంట్‌తో చాలా మంది టీడీపీ, జనసేన, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కొండపిలో ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తాడేపల్లిలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు యర్రగొండ పాలెంలో గూడూరు ఎరిక్సన్ బాబు (టీడీపీ), నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానంలో గద్దె రామ్మోహన్, గుంటూరు జిల్లా తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య, కావాలిలో కావ్య కృష్ణారెడ్డి (టీడీపీ), పాలకొల్లులో నిమ్మల రామానాయుడు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.






