స్కూల్స్ పై కూటమి కీలక నిర్ణయం... ఇకపై వారికి నో ఎంట్రీ !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్రంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్కూల్ విద్యార్థులకు (school

స్కూల్స్ పై కూటమి కీలక నిర్ణయం... ఇకపై వారికి నో ఎంట్రీ !
X

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాష్ట్రంలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ స్కూల్ విద్యార్థులకు (school students) ఎలాంటి సమస్యలు తలెత్తకుండా... పథకాలు అమలు చేస్తూనే... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం. ఇకపై పాఠశాలలో రాజకీయాలకు నో ఎంట్రీ అని ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్ప... ఏ ఇతర అనధికార వ్యక్తులను... అనుమతించరాదని.. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కూటమి సర్కార్. రాజకీయ పార్టీల గుర్తులు అలాగే వస్తువుల ప్రదర్శనలు నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ రూల్ ఇవ్వాల్టి నుంచే అమలు కాబోతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story