వైసీపీ అన్నదాత పోరుకు అనుమతి లేదు: సీఐ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-09 03:32:49  IST  )

రైతుల యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ.. నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరుకు (YCP Annadatha Poru) పిలుపునిచ్చింది.

వైసీపీ అన్నదాత పోరుకు అనుమతి లేదు: సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కేంద్రం నుంచి రాష్ట్రానికి యూరియా (Urea Crisis) వచ్చినా.. అవి తమ అవసరాలను తీర్చలేదని వాపోతున్నారు. రైతుల యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ.. నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరుకు (YCP Annadatha Poru) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అన్నదాతపోరుకు అనుమతి లేదని సీఐ వైవీవీఎల్ నాయుడు తెలిపారు. టౌన్ లో ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించరాదని వెల్లడించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story