ఇంగితజ్ఞానం ఉన్నవారెవరూ మళ్లీ జగన్‌ను సీఎంగా కోరుకోరు : నన్నపనేని రాజకుమారి

by Seetharam |   (  Updated:2023-09-26 13:06:44  IST  )

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి 18 రోజులైనా ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదు అని టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు.

ఇంగితజ్ఞానం ఉన్నవారెవరూ మళ్లీ జగన్‌ను సీఎంగా కోరుకోరు : నన్నపనేని రాజకుమారి
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి 18 రోజులైనా ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదు అని టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీసభ్యుల్ని బయటకు పంపించిన అధికారపార్టీ సభ్యులు కుప్పిగంతులతో ముఖ్యమంత్రి భజన చేస్తున్నారు అని ఆరోపించారు. ఎవరూ ధైర్యంగా జగన్ రెడ్డి చేసింది తప్పని చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి చేసిన పనిని సొంతపార్టీ వారే పిచ్చిచేష్టగా అభివర్ణిస్తున్నారు. జగన్ రెడ్డి చేసిందానికి మేం ప్రజలముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలే వాపోతున్నారు అని నన్నపనేని రాజకుమారి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను యావత్ ప్రపంచం గమనిస్తోందని, చంద్రబాబు కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, ఆయనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే సీఎం వైఎస్ జగన్ తెలివితక్కువగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు మేథస్సు... ఆయన కీర్తి ప్రతిష్టలు.. ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ మరువలేం అని చెప్పుకొచ్చారు. పదిమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే న్యాయశాస్త్ర వ్యాఖ్యను చంద్రబాబు విషయంలో మననం చేసుకోవాలి అని అన్నారు. చంద్రబాబు నాయుడి మేథస్సు, కీర్తి ప్రతిష్టలు, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరిచిపోలేం అని అన్నారు. హైటెక్ సిటీ నిర్మాణంతో ఆయన కీర్తి ఆకాశాన్నే అంటిందని నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.

లోకేశ్ పారిపోలేదు..సింహంలా త్వరలోనే జూలు విదిలిస్తారు

అసెంబ్లీలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా రు అని నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. మరలా జగన్ రెడ్డి రావాలనడం వారి అజ్ఞానమేనని అభిప్రాయపడ్డారు. అమ్మఒడిని అయ్యబుడ్డిగా మార్చాడు... నిత్యావసరాలు సహా అన్నిధరలు పెంచేశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మరలా రావాలని ఇంగితజ్ఞానమున్న వారు ఎవరూ కోరుకోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి 18 రోజులైనా ఆయన తప్పు చేశాడని నిరూపించలేకపోయారని చెప్పుకొచ్చారు. అయి నా సిగ్గులేకుండా పవిత్రమైన అసెంబ్లీలో కారుకూతలు కూస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబుకు మద్ధతుగా రోడ్లెక్కుతుంటే పోలీసులతో వారిని అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దోషి అని నిరూపించలేక.. నిర్దోషిగా వదిలిపెట్టలేక ఈ ప్రభుత్వం, ము ఖ్యమంత్రి సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నిచేసినా... చంద్రబాబుకి చిన్న అవినీతి మరక కూడా అంటించలేడు అని చెప్పుకొచ్చారు. లోకేశ్ పారిపోయాడంటున్న వారు.. సింహం త్వరలోనే జూలు విదిలించి బయటకు వస్తుందని తెలుసుకుంటే మంచిది అంటూ నన్నపనేని రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story