- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఎవ్వరు ఏమనుకున్నా CBN తర్వాత స్థానం లోకేశ్‌దే’.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి పై జోరుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి పై జోరుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ జోరుగా చర్చలు జరిగాయి. ఈ అంశం పై ఇటీవల మంత్రి లోకేష్ కూడా స్పందించారు. అయితే ఈ అంశంపై కార్యకర్తలు, నేతలు ఎవరు స్పందించొద్దని జనసేన(Janasena), టీడీపీ(TDP) హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achchennaidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరు ఏమనుకున్నా టీడీపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) తర్వాతి స్థానం లోకేష్‌దే అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. కూటమికి 164 సీట్లు రావడంలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనకు డిప్యూటీ పీఎం ఇవ్వాలనే అంశం ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదని చెప్పారు. పదవులైనా, నిర్ణయాలైనా కూటమి ప్రభుత్వమే(AP Government) తీసుకుంటుందని తెలిపారు.






