ఆ జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్

by Ajay Maddhiboyina |

బండిపై వెళుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని రూల్ ఉన్న సంగతి తెలిసిందే. హెల్మెట్ తప్పనిసరి చేసింది వాహనదారుల సేఫ్టీ కోసమే అయినా చాలా మంది రూల్స్ పాటించడంలేదు.

ఆ జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్
X

దిశ, వెబ్ డెస్క్: బండిపై వెళుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని రూల్ ఉన్న సంగతి తెలిసిందే. హెల్మెట్ తప్పనిసరి చేసింది వాహనదారుల సేఫ్టీ కోసమే అయినా చాలా మంది రూల్స్ పాటించడంలేదు. దొరికినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నారు. దొరికా మహా అయితే వంద, రెండు వందలు ఫైన్లు వేస్తారని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల ఆట కట్టిస్తున్నారు కొందరు పోలీసులు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు తప్పనిసరిగా పెట్రోల్ కోసం అయినా హెల్మెట్ ధరించాల్సి వస్తుంది. తాజాగా రామచంద్రాపురంలో హెల్మెట్ ధరించని వాహనదారులకు ఎస్సై భక్తవత్సలం ఫైన్ వేయడంతో పాటు వారికి పెట్రోల్ కొట్టకుండా బంక్ నుండి వెనక్కి పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story