- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులెవ్వరూ అధైర్యపడొద్దు : మంత్రి వాసంశెట్టి సుభాష్
మొంథా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్యపడొద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్యపడొద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. రామచంద్రాపురంలో విస్తృత పర్యటన నిర్వహించి తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి పంట నష్టం అంచనాను తెలుసుకున్నారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దు, ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. తుఫాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ 1000, బృందాలు, 12 వేల మంది సిబ్బందితో పని చేస్తోందన్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి రూ.3 వేలు నగదు, 25 కేజీల బియ్యం, నిత్యవసరాలు అందజేస్తామని పేర్కొన్నారు. మత్స్యకార, చేనేత వారికి 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు ఇస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు దూర దృష్టితో, అపార అనుభవంతో అధికారులను, కూటమి పార్టీ నాయకులను, ప్రజలను అప్రమత్తం చేసి తుఫాన్ వల్ల అధిక నష్టం జరగకుండా చూశారన్నారు. ముఖ్యంగా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. తమది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని, రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.
READ MORE .....






