- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మలా సీతారామన్ ది తల్లిలాంటి ప్రేమ : మంత్రి పయ్యావుల కేశవ్
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ది తల్లిలాంటి ప్రేమ అని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ది తల్లిలాంటి ప్రేమ అని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో శుక్రవారం జరిగిన బ్యాంకు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తనతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను అమరావతికి తీసుకొచ్చారన్నారు. అక్కడకు హాజరైన బ్యాంకుల ప్రతినిధులను, అధికారులను ఉద్దేశిస్తూ వారి అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమన్నారు. అలాంటిది వారిని అమరావతికి తీసుకురావడంలోనే ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్మలా సీతారామన్ మద్ధతు కనిపిస్తోందన్నారు.
చాలా మంది నిర్మలా సీతారామన్ చాలా టఫ్ లేడీ అని చెప్పారన్నారు. ఆ మాటను తాను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఇంట్లో అమ్మకూడా అంతే కఠినంగా ఉంటారన్నారు. అమ్మ కఠినంగా లేకపోతే ఈరోజు తామిలా అయ్యేవాళ్లం కాదన్నారు. అడిగినవన్నీ అమ్మ కొనిపించదు.. ప్రతి రోజూ ఐస్ క్రీం, బట్టలు కొనిపించరని పేర్కొన్నారు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే తల్లి ఇస్తుందన్నారు. అటువంటి అమ్మతనాన్ని తాను నిర్మలా సీతారామన్ లో చూశామన్నారు. చాలా మంది వారికి కోపమెక్కువంటారని పేర్కొన్నారు. అయితే సమయం వ్యర్థం చేయడమంటే కోపమని వివరించారు. ఏదైనా అంశంపై మాట్లాడానికి సమయం ఇచ్చినప్పుడు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటారని తెలిపారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా విశ్లేషించుకుంటారన్నారు. అటువంటి స్పందననే వారు ఎదుటి వారి నుంచి ఆశిస్తారన్నారు. అది లభించకపోతే తప్పకుండా కోపడతారన్నారు. పోలవరం గురించి ఆమెకున్న సమాచారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ కు ఇంధనం ధనమే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నామంటే, రైల్వే, రోడ్డు నెట్వర్కులకు, హాస్పిటల్లో మద్ధతు పెరుగుతుందన్నా ప్రధానమంత్రి కారణమన్నారు. ఆయన రూపకల్పన చేస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆచరణలో చూపిస్తున్నారని తెలిపారు.
జీఎస్టీ రిఫార్మ్స్ నెలలో చేస్తామని ప్రధానమంత్రి అన్నారు. ఆరు నెలలైనా పడుతుందని తాను అనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ నెల రోజుల్లో ఆర్థిక మంత్రి అమలు చేశారన్నారు. బడ్జెట్ పూర్తి చేసిన రోజే జీఎస్టీ సంస్కరణను తీసుకొచ్చామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. పంతాలు, పట్టింపులకు వెళ్లకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తూ సహకరిస్తారని మంత్రి కేశవ్ తెలిపారు.






