లివర్ డ్యామేజ్.. మెదడులో వాపు.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-30 12:31:43  IST  )

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు...

లివర్ డ్యామేజ్.. మెదడులో వాపు.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య(Excise Constable Soumya)కు లివర్ డ్యామేజ్(Liver Damage) అవడంతో పాటు మెదడులో వాపు రోజు రోజుకు పెరుగుతోందని నిమ్స్ వైద్యులు(Nims Doctors) బులిటెన్‌ను విడుదల చేశారు. నిజామాబాద్‌(Nizamabad)లో గంజాయి స్మగ్లర్ల(Marijuana Smugglers) కారు దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆమెకు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కానీ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు. లైఫ్ సపోర్ట్‌పై వైద్యం చేస్తున్నామని తెలిపారు. అటు డయాలసిస్ సైతం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ సౌమ్య అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.

Next Story