- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప జైలుకు వచ్చిన NIA అధికారులు.. పీటీ వారెంట్‌పై సైరాబాను తరలింపు
by Kema Shiva Kumar |
రాయచోటి (Rayachoti)లో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ (Abubakar Siddiqui)తో పాటు మహమ్మద్ అలీ (Muhammad Ali)ని తమిళనాడుకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రాయచోటి (Rayachoti)లో ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ (Abubakar Siddiqui)తో పాటు మహమ్మద్ అలీ (Muhammad Ali)ని తమిళనాడుకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో తాజాగా అబూబకర్ సిద్దిఖీ భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీంను కూడా కడప పోలీసులు అరెస్ట్ చేయగా.. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో ఇవాళ ఎన్‌ఐఏ అధికారులు కడప జైలుకు వచ్చి నిందితురాలు సైరాబానును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను పీటీ వారెంట్‌పై వారం రోజుల కస్టడీకి తీసుకుని విజయవాడకు తరలించారు.
Next Story






