- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పం ఘటనపై NHRC సీరియస్.. సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
భర్త చేసిన అప్పులకు భార్యను చెట్టుకట్టేసిన ఘటనపై ఎన్ హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది..

X
దిశ, వెబ్ డెస్క్: భర్త చేసిన అప్పులకు చిత్తూరు జిల్లా కుప్పంలో భార్యను చెట్టుకట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను యావత్తు రాష్ట్రం మొత్తం ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు సైతం కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ ఘటనపై తాజాగా NHRC కూడా సీరియస్ అయింది. అప్పు చెల్లించనందుకు మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను సుమోటోగా స్వీకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీకి NHRC ఆదేశించింది.
Next Story






