సాక్షి టీవీపై NHRC కేసు నమోదు

by Muthe.Rajitha |

ఏపీ రాజధాని అమరావతి(Amaravati) మహిళలపై సాక్షి టీవీలో జరిగిన డిబేట్ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది.

సాక్షి టీవీపై NHRC కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(Amaravati) మహిళలపై సాక్షి టీవీలో జరిగిన డిబేట్ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది. టీవీ డిబేట్ లో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు(Journalist Kommineni Srinivasa Rao), కృష్ణంరాజులు అమరావతి మహిళలు వేశ్యలు అంటూ, అది వేశ్యల రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆంధ్ర రాష్ట్రం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున సాక్షి టీవీకి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

కాగా ఇప్పటికే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు. అయితే తాజాగా సాక్షి టీవీపై నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishna Devaraya) జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు. రాజధానిని ఘోరంగా అవమానించారని, సుమోటోగా ఈ కేసును దర్యాప్తు చేయాలని కోరారు. ఫిర్యాదును పరిశీలించిన హక్కుల కమిషన్ సాక్షి టీవీపై కేసు నమోదు చేసింది.

Next Story